తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన బుధవారం ఉదయం వెళ్లారు. అక్కడ రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ సర్వే నివేదికను సమర్పించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ చేసేలా రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ కోరనున్నారు. కాగా రేపు అన్ని పార్టీల ఎంపీలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్. మరో వైపు రేపు సాయంత్రం తెలంగాణ బీసీ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 25న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరగనున్న భాగీదారి సమ్మేళన్‌లో కాంగ్రెస్ బీసీ నేతలు పాల్గొననున్నారు.