CM Revanth Reddy : నిన్న‌టిదాక ప్ర‌చార ప‌ర్వంలో.. నేడు ప్లేయ‌ర్‌గా గ్రౌండ్‌లో..

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు మాత్ర‌మే ఉంది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారంలో బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధుల‌తో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By Medi Samrat  Published on  12 May 2024 12:00 PM IST
CM Revanth Reddy : నిన్న‌టిదాక ప్ర‌చార ప‌ర్వంలో.. నేడు ప్లేయ‌ర్‌గా గ్రౌండ్‌లో..

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు మాత్ర‌మే ఉంది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారంలో బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధుల‌తో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర, దేశవ్యాప్తంగా వారాల తరబడి హోరాహోరీగా ప్రచారం చేసిన రేవంత్.. ఈ ఉద‌యం ‘ఇండియా’ జెర్సీని ధరించి వర్సిటీలోని ప్లేగ్రౌండ్ లో పుట్‌బాల్ ఆడుతూ ద‌ర్శ‌న‌మిచ్చారు.

తెలంగాణలో మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు చేపట్టిన హోరాహోరి ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్‌ కేంద్రాల్లో 3.31 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 13న జరగనున్న సికింద్రాబాద్ (కంటోన్మెంట్) అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

Next Story