ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రైతుకు తెలంగాణ సిఎం ఫిదా
Telangana CM Invitation To AP farmer. ఇప్పటి కాలంలో వ్యవసాయం పైన ఆసక్తి చూపిస్తున్నవాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే
By Medi Samrat Published on 20 Dec 2020 11:41 AM ISTఇప్పటి కాలంలో వ్యవసాయం పైన ఆసక్తి చూపిస్తున్నవాళ్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయం చేసేవాళ్లు కూడా లేకుండా పోతే తినడానికి ఏమీ ఉండదనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం వైపు యువత దృష్టి పెట్టాల్సి ఉందని చాలా మంది చెబుతూ వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణకు పెద్ద పీఠ వేస్తూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతు పండించిన పంటకు ఫిదా అయిన కేసీఆర్ ఆయన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తాను కారు పంపిస్తానని, వచ్చి భోజనం చేసి వెళ్లాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదర్శ రైతును కేసీఆర్ ఆహ్వానించారు.
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరిని సాగుచేసి అధిక దిగుబడి సాధించారు. ఎకరానికి దాదాపు 45 బస్తాల వరకు దిగుబడి సాధించారు. ప్రసాదరావు వ్యవసాయ పద్ధతుల గురించి తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. వెద పద్ధతి గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. తాను కారు పంపిస్తానని, ఒక పూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ఆయనను ఆహ్వానించారు. తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శరైతు ఉప్పల ప్రసాదరావుకు శనివారం ఉదయం 9.30 గంటలకు కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. సీడ్రిల్ ఆధునిక వ్యవసాయ యంత్రాలు, వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై రైతు ప్రసాదరావును ఆయన అడిగి తెలుసుకున్నారు. తాను 35 ఎకరాల్లో సీడ్రిల్‌ను ఉపయోగించి వెద పద్ధతిలో సన్నరకం వరి సాగు చేశానని.. ఎకరానికి 40-45 బస్తాలు దిగుబడి సాధించానని ప్రసాదరావు తెలిపారు. త్వరలో కారు పంపిస్తానని, తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని, ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ప్రసాదరావుకు కేసీఆర్ ఆహ్వానం పలికారు. కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ప్రసాదరావును పలువురు రైతులు అభినందించారు.
ఉప్పల ప్రసాదరావు గత 32 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఎకరాలు, రెండు గేదెలతో వ్యవసాయం మొదలుపెట్టిన ఆయనకు ఇప్పుడు 200 ఎకరాలు ఉంది. వ్యవసాయం, పశుపోషణ అనుబంధంగా సాగిస్తున్నారు. 1982లో చదువుకుంటూనే వ్యవసాయం మొదలుపెట్టారు. తండ్రిని ఒప్పించి వ్యవసాయంవైపు అడుగులు వేసిన ప్రసాదరావు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్గానిక్ పద్ధతితో గడ్డి పండించి, పశువులకు వేయడం వల్ల దిగుబడి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎంతో మందికి ఈయన ఒక ఆదర్శంగా నిలిచారు.