ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

By Medi Samrat  Published on  28 Feb 2024 2:15 PM GMT
ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్ర పాలీకి ఆదేశాలు ఇచ్చారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story