ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే

కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరగనుంది

By -  Knakam Karthik
Published on : 22 Nov 2025 11:43 AM IST

Telangana, Congress Government, CM Revanthreddy, Telangana Cabinet

ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు, బీసీలకు 42% కోటా విషయంలో చట్టపరమైన సవాళ్లు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కాగా కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. ఈ నెల 26న గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు మొదటి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 20లోపు 3 విడతల్లో 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. కేబినెట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా-ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

మరో వైపు విద్యుత్​ రంగానికి సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా ఈనెల 25న రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుందని సాధారణ పరిపాలనాశాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రామగుండంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన థర్మల్​ విద్యుత్​ ప్లాంట్​ అంచనా వ్యయంతో పాటు 4,500 మెగావాట్ల పంప్ట్​ స్టోరేజ్​ పవర్​ ప్లాంట్లు(పీఎస్​పీ), 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ వ్యవస్థ(బెస్​)ల ఏర్పాటుకు ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనలు ఇచ్చారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Next Story