నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదాపడింది.
By - Knakam Karthik |
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా
నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదాపడింది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 12కు తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. 12వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. 12న జరిగే కేబినెట్‌లో గిగ్ వర్కర్స్ బిల్లును ప్రభుత్వం ఆమోదించనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు చేయనుంది.
సీఎం రేవం తిరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గత నెల (అక్టోబర్ 23 గురువారం)న రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తెలం గాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ కోసం గవర్నర్‌కు ఫైల్ పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా ఈ నెల చివరన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాత రిజర్వేషన్ల తో (50 శాతం) ఎన్నికలకు వెళ్లాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.