తెలంగాణ బడ్జెట్.. ఒక్కో రంగానికి కేటాయింపులు ఇలా..
Telangana Budget 2021. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది
By Medi Samrat Published on 18 March 2021 12:43 PM IST2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11.30 కి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. తనకు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏడేళ్లలో తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందని చెప్పారు. సమస్యలను, సవాళ్లను అధిగమిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్లుగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2,30,825.96 కోట్లు అని వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు అని, మిగులు రూ.6,743.50 కోట్లు అని చెప్పారు. ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లని, మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు అని తెలిపారు. గత బడ్జెట్ కంటె 48వేల కోట్ల అధిక అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
-కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు
- ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిది కోసం 21,306.85 కోట్లు
- ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు
- నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.
- బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు
- ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు
- సీఎం దళిత ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం పేరుతో నూతన పథకం
- వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్లు
- రైతు బంధు పథకం కోసం 14800 కోట్లు
- రుణమాఫీ కోసం 5225 కోట్లు
- రైతు బీమా స్కీమ్ కు 1200 కోట్లు
- మొత్తం వ్యవసాయ రంగంలో 25 వేల కోట్లు
- పశు,మాస్థ్య శాఖకు 1730 కోట్లు
- సాగునీటి రంగానికి 16,931కోట్లు
- సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
-స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1502 కోట్లు
- రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు
- వ్యవసాయానికి 25 వేల కోట్లు
- పశుసంవర్ధక శాఖకు 1730 కోట్లు
-డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.11వేల కోట్లు
-పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
-సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు
- ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు..
- రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కు 750 కోట్లు
- నూతన సచివాలయం నిర్మాణం కు 610 కోట్లు
- దేవాదాయ శాఖకు 720 కోట్లు
- అటవీ శాఖకు 1276 కోట్లు
- ఆర్టీసీ కి 1500 కోట్లు
- ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్లు...త్వరలో మార్గదర్శకాలు
- రైతు బంధు కోసం 14,800 కోట్లు
- సాగునీటి రంగానికి 16,931 కోట్లు
- సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్లు
- పోలీసు స్టేషన్ లలో షి టాయిలెట్ల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు,
యూనివర్సిటీలలో షి టాయిలెట్స్ నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు
-కలెక్టరేట్లు,జిల్లా పోలీసు కార్యాలయలు,పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం 725 కోట్లు
- హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరాకు 250 కోట్ల రూపాయలు
- రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం
- హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకు 725 కోట్లు
- ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్లు
- ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు
- నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్లు.
- బీసీ సంక్షేమ శాఖకు 5522 కోట్లు
- మెట్రో రైలు ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖకు 6295 కోట్లు
- 4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం
- పాఠశాల విద్యకి 11,735 కోట్లు
- ఉన్నత విద్యా రంగానికి 1,873కోట్లు
- ఐటీ రంగముకు 360 కోట్లు
- విద్యుత్ శాఖకు 11,046 కోట్లు
- పరిశ్రమల శాఖకు 3, 077 కోట్లు
-హోమ్ శాఖకు 6465 కోట్లు
- మహిళా,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 11 వేల కోట్లు
- పట్టణాల్లో వైకుంఠధామం నిర్మాణం కోసం 200 కోట్లు
- మూసీ సుందరీకరణకు 200 కోట్లు