తెలంగాణలో ఈ నెల 22న ధర్నాలకు కేటీఆర్ పిలుపు

ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2024 4:42 PM IST
Telangana, brs, KTR,   dharna,

 తెలంగాణలో ఈ నెల 22న ధర్నాలకు కేటీఆర్ పిలుపు 

ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 22న అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో చాలా మంది రైతులకు రుణమాఫీ అందలేదనీ.. దాంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చెబుతోందనీ.. ఇంకా మంత్రులు మాత్రం ఇంకా పూర్తికాలేదనే చెబుతున్నారని అన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు. రైతులను కన్ఫ్యూజ్ చేసి ఆందోళనకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

రైతు రుణమాఫీ జరగని రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురిచేస్తున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు. కనీసం 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కారణంగా లక్షలాది మంది రైతన్నలు రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు వచ్చాయనీ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మొదట డిసెంబర్ 9 లోగా రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్‌ రెడ్డి మాట తప్పారని అన్నారు. ఆగస్టు 15 అంటూ మరోసారి మోసం చేశారని మడిపడ్డారు. అడ్డగోలుగా ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ వ్యవహారాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని కేటీఆర్ చెప్పారు. రైతన్నలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందే వరకూ తాము పోరాడతామని కేటీఆర్ పేర్కొన్నారు.

Next Story