రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ భరతం పడతారు..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇపుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ గురించి బీజేపీ ప్రభుత్వంపై నెట్టేస్తున్నారు. 42 శాతం ఇచ్చేవరకు మీకు కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే హక్కు లేదు. మీకు చిత్త శుద్ధి లేక బీజేపీ ఎంపీల మీద మాటలు మాట్లాడుతున్నారు. బీసీల పేరు మీద కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. బీసీలకు అన్యాయం చేస్తున్నారు. మీ తుగ్లక్ పరిపాలన ఆపేసి ప్రజలకు మంచి చెయ్యండి. రాబోయే రోజుల్లో ప్రజలు మీ భరతం పడతారు. నన్ను బీసీ ద్రోహి అన్నారు. బీజేపీకి బలమే ఒబీసీలు. తెలంగాణ విమోచన దినోత్సవం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. పెరేడ్ గ్రౌండ్సలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం..అని టీబీజేపీ చీఫ్ వ్యాఖ్యానించారు.