బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 8:40 PM ISTబీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమయాత్తం అవుతున్న విషయం తెలిసిందే. ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇక తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోగా.. కాంగ్రెస్ అధిక స్థానాలను చేజిక్కుంచుకుని పాలనను కొనసాగిస్తోంది. ఇక బీజేపీ పార్టీ కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. అలాగే ఎమ్మెల్యేను ఎక్కువగానే గెలిచింది. దాంతో.. లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటి.. ఎవరూ ఊహించని విధంగా మెజార్టీ స్థానలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన .. బహిరంగ సభలో పాల్గొని సంచలన కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీని రేవంత్‌రెడ్డి నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని చెప్పారు. అంతేకాదు.. కోమటిరెడ్డి తర్వాత సీఎం కుర్చీని లాక్కునేందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో పదవుల కోసం కొట్లాడేవారు ఉన్నారు తప్ప.. ప్రజలకు మంచి చేయాలనుకునే నాయకులు లేరని ధర్మపురి అర్వింద్ కామెంట్ చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవలో నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్న అర్వింద్.. రేవంత్‌రెడ్డి, కవిత ఇద్దరూ ఒకటే అని చెప్పారు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ అభ్యర్థిని డిసైడ్ చేస్తారని కామెంట్ చేశారు. రైతుబంధు నిధుల జమ చేయడంలో కాంగ్రెస్ అవినీతి చేస్తోందని ఆరోపించారు. కోమటిరెడ్డి రూ.2వేల కోట్లు, పొంగులేటి రూ.3వేల కోట్లు బిల్లుల కింద తీసుకున్నారని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అధిక స్థానాలు గెలుస్తుందనీ.. అలాగే తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ దీమా వ్యక్తం చేశారు.