బండి సంజయ్ ఆ కేసు నుండి బయటపడతారా..?

Telangana BJP Cheif Bandi Sanjay. టెన్త్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీ కేసులో తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని తెలంగాణ బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ అంటున్నారు.

By Medi Samrat  Published on  22 April 2023 7:18 AM GMT
బండి సంజయ్ ఆ కేసు నుండి బయటపడతారా..?

Bandi Sanjay


టెన్త్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీ కేసులో తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని తెలంగాణ బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తప్ప మరేమీ కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ తరుణంలో తనపై పెట్టిన కేసును కొట్టేయాలని, దర్యాప్తుపై స్టే విధించాలని హైకోర్టును బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ కోరారు. హైకోర్టు దీనిపై కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వానికి, కమ లాపురం హెడ్మాస్టర్లకు చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేసింది. సంజయ్‌‌‌‌‌‌‌‌ తరపున అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ ఎల్‌‌‌‌‌‌‌‌.రవిచందర్‌‌‌‌‌‌‌‌ వాదించారు. పరీక్ష మొదలు అయ్యాక పేపర్‌‌‌‌‌‌‌‌ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన హెడ్మాస్టర్​పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సంజయ్‌‌‌‌‌‌‌‌పై ఫిర్యాదు చేసేందుకు మాత్రం ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారని అన్నారు. సంజయ్‌‌‌‌‌‌‌‌పై పెట్టిన కేసును కొట్టేయాలని, ఆయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులివ్వాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయకుండా పోలీసులు ఏకపక్షంగా అరెస్టు చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించి సంజయ్‌‌‌‌‌‌‌‌ని అరెస్టు చేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ, సంజయ్‌‌‌‌‌‌‌‌ని పోలీసులు అరెస్టు చేశాక టెన్త్‌‌‌‌‌‌‌‌ పేపర్ల లీకేజీ జరగలేదన్నారు. లీకేజీలో సంజయ్‌‌‌‌‌‌‌‌కి కీలకపాత్ర ఉందని, పేపర్​ లీకేజీ వివరాలు ఇతరులకు ఫోన్‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపారన్నారు. అనంతరం విచారణ జూన్‌‌‌‌‌‌‌‌ 16కి వాయిదా పడింది.


Next Story