ఫార్ములా ఈ రేస్ కేసు: మూడు కంపెనీల్లో ఏసీబీ సోదాలు

ఫార్ములా ఇ రేస్ కేసుతో సంబంధం ఉన్న మూడు కంపెనీల కార్యాలయాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది.

By అంజి  Published on  7 Jan 2025 1:06 PM IST
Telangana, ACB, Ace Nxt Gen Office, Formula E race case, Hyderabad

ఫార్ములా ఈ రేస్ కేసు: మూడు కంపెనీల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: ఫార్ములా ఇ రేస్ కేసుతో సంబంధం ఉన్న మూడు కంపెనీల కార్యాలయాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

మాదాపూర్‌లోని Ace Nxt Gen Office, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీల డైరెక్టర్లు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి- గ్రీన్కో గ్రూప్ ప్రమోటర్లు కూడా.

ఈ కంపెనీలు 2023లో జరిగిన ఫార్ములా ఇ రేస్‌కు ప్రాథమిక స్పాన్సర్ అయిన గ్రీన్‌కోతో అనుసంధానించబడినట్లు చెబుతున్నారు. కెటిఆర్ తన లీగల్ టీమ్‌ను ఏసీబీ ముందు హాజరుకావడానికి నిరాకరించిన ఒక రోజు తర్వాత సోదాలు జరిగాయి.

గ్రీన్‌కో తన ఇతర సిస్టర్‌ కంపెనీలు, గ్రూప్ కంపెనీల ద్వారా 2023లో ఎలక్టోరల్ బాండ్‌లుగా సుమారు రూ. 41 కోట్లను బీఆర్‌ఎస్‌కి విరాళంగా అందించడం గమనార్హం. అయితే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్‌ఎస్‌కు గ్రీన్‌కో రూ.41 కోట్ల ఆర్థిక ప్రయోజనాలను అందజేసిందన్న నిరాధార ఆరోపణలను కేటీఆర్ ఖండించారు.

గ్రీన్కో 2022లో ఎలక్టోరల్ బాండ్‌లను పొందింది. ఫార్ములా-ఇ రేస్ 2023లో జరిగింది. వాస్తవానికి, ఇ-రేస్ ఫలితంగా కార్పొరేషన్ నష్టాలను చవిచూసింది. ఆ తర్వాతి సంవత్సరం ఈవెంట్‌కు దాని స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. .

మరోవైపు గ్రీన్‌కో కార్యాలయంలో సోదాలు చేసేందుకు ఏసీబీ అధికారుల బృందం విజయవాడకు చేరుకుంది. రాయదుర్గం, నందినగర్‌లోని కేటీఆర్ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించేందుకు సిద్ధమైంది. మరోవైపు, ఈడీ ఆర్డర్ కాపీ కోసం వేచి ఉంది. నిందితులందరికీ తాజా నోటీసులు జారీ చేసింది.

Next Story