గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 67.17 శాతం హాజరు.. ఆ జిల్లా నుంచే అత్యధికం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 67.17 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఏడు పేపర్లకు హాజరయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి

By Medi Samrat  Published on  28 Oct 2024 10:54 AM GMT
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 67.17 శాతం హాజరు.. ఆ జిల్లా నుంచే అత్యధికం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు 67.17 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఏడు పేపర్లకు హాజరయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 17,779 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో మొత్తం ఏడు పేపర్లకు 10,869 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా నుంచి 8,011 మంది అభ్యర్థులు పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం ఏడు పేపర్లకు 5,505 మంది అభ్యర్థులు హాజ‌ర‌వ‌గా.. రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన 5,613 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు అర్హత సాధించగా.. 4,719 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

TGPSC పరీక్షలకు ముందు జీవో 29ని సవాలు చేస్తూ అభ్యర్ధనలు తెలంగాణ హైకోర్టును సంప్ర‌దించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం తమ అభ్యర్ధనలపై నిర్ణయం తీసుకునే వరకు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేయ‌గా.. వీరి డిమాండ్‌కు విపక్షాలు, బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతు తెలిపాయి. అయితే కోర్టు అనూహ్యంగా అభ్య‌ర్ధుల‌కు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పింది. ఆ త‌ర్వాత పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దీంతో మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.

Next Story