తెలంగాణలో నేడు పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకానున్నాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఫలితాలను http:// results. bse.telangana.gov.in, http://results.bsetela అనే వెబ్‌సైట్లలో చూడవచ్చని తెలిపారు. తెలంగాణ SSC ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ మార్కుల మెమోలను bse.telangana.gov.in , results.bsetelangana.org నుండి హాల్ టిక్కెట్ నంబర్‌లను ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గతేడాది బీఎస్‌ఈ తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో మొత్తం 86.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాష్ట్రంలో మార్చి 18 నుండి ప్రారంభమయ్యాయి, ఈ సంవత్సరం మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు, ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షలను 2,676 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిర్వహించారు. ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు SSC బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది.