లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా

Telagana University VC Ravinder Gupta Caught By ACB While Taking Rs 50000 Bribe. తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. తార్నాకలోని త‌న‌ ఇంట్లో లంచం తీసుకుంటూ

By Medi Samrat  Published on  17 Jun 2023 9:03 AM GMT
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా

తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. తార్నాకలోని త‌న‌ ఇంట్లో లంచం తీసుకుంటూ రవీందర్ గుప్తా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ పరీక్షా కేంద్రానికి అనుమతిచ్చేందుకు 50 వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రవీందర్ గుప్తా.

ఈ విష‌య‌మై డీఎస్పీ సుద‌ర్శ‌న్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామ‌న్నారు. వీసీ ఇంట్లో 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికార‌ని దృవీక‌రించారు. భీమ్ గల్ లో ఉన్న ఒక కళాశాలకు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రవీందర్ గుప్తా 50 వేలు లంచం డిమాండ్ చేశార‌ని వెల్ల‌డించారు. గతంలో ఆయ‌న‌పై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. రెండు చోట్ల సోదాలు చేస్తున్నామ‌ని తెలిపారు. నివాసంతో పాటు యూనివర్సిటీ లో కూడా సోదాలు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. సోదాలు పూర్తి అయిన తర్వాత ఆరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామ‌ని తెలిపారు.


Next Story