కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంది. కులగణన సర్వేను తప్పుబడుతూ అభ్యంతరకరమైన విమర్శలు చేసి, కులగణన ఫామ్ దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఫిబ్రవరి 5వ తేదీన నోటీసులు జారీ చేసింది. నోటీసులపై ఫిబ్రవరి 12వ తేదీలోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ ఆదేశించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం, పార్టీ లైన్‌కు విరుద్ధంగా మాట్లాడుతున్నారని చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసేందుకు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని.. డీఏసీ ఛైర్మన్ చిన్నారెడ్డి లేఖ విడుదల చేశారు.