కేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. టీడీపీతోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలంటూ..
తెలంగాణలో టీడీపీ ఉనికి ఎక్కడ ఉందంటూ మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఘాటుగా స్పందించారు.
By అంజి Published on 28 Sep 2023 4:45 AM GMTకేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. టీడీపీతోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలు
హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ ఉనికి ఎక్కడ ఉందంటూ మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభమైందని ఆమె గుర్తు చేశారు. టీడీపీలో కేసీఆర్ ఎన్నో పదవులు అందించారని ఆమె పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు రాజకీయంగా అధికారం కల్పించింది టీడీపీయేనని ఆమె వివరించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులపై బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఎక్కడ అరెస్టు అవుతుందోనన్న భయంతో ఢిల్లీ, మహారాష్ట్రలో పార్టీ నాయకులతో ఆందోళనలు నిర్వహించలేదా? అని ప్రశ్నించారు.
''కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తోంటే తెలంగాణలో ప్రాథమిక హక్కులకు న్యాయం జరగదనిపిస్తోంది. కేసీఆర్ పంజాబ్‌కు వెళ్లి అక్కడి రైతులకు చెక్కులు ఎందుకు ఇచ్చారు?'' అని ప్రశ్నించారు.శాంతియుత ర్యాలీలను మంత్రి కేటీఆర్ ఆపలేరని అన్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఓయూలోని పోస్టాఫీసు నుంచి రాష్ట్రపతికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్ పోస్టుకార్డులు పంపారు. చంద్రబాబు అరెస్ట్‌లో ఏపీ సీఎం జగన్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ పాత్ర కూడా ఉందని తెలంగాణ కమ్మ రాజకీయ సంఘం నేతలు ఆరోపించారు.
మంత్రి కేటీఆర్ కామెంట్స్‌ని హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ని ఓడిస్తామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు న్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆరీఫ్ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై బీఆర్‌ఎస్ విధానం ఏంటో చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ అన్నారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు.