నా కూతురు చావుకు కారణం అతడే : స్వేచ్ఛ తండ్రి

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat
Published on : 28 Jun 2025 4:18 PM IST

నా కూతురు చావుకు కారణం అతడే : స్వేచ్ఛ తండ్రి

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు చావుకు పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని, మూడు సంవత్సరాల నుంచి తన కూతురు వెంట పూర్ణచందర్ పడ్డాడని ఆరోపించారు. అతడి వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతురు పెళ్లికి అంగీకరించిన తర్వాత ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయని, గొడవలు తారాస్థాయికి చేరడంతో ఇటీవల పూర్ణచందర్‌తో ఉండనని తేల్చి చెప్పిందన్నారు. జూన్ 26 ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచిందని, ఆ రోజు నేను స్వేచ్ఛతో మాట్లాడానన్నారు.

హైదరాబాద్: తెలుగు టీవీ న్యూస్ ప్రెజెంటర్ అయిన స్వేచ్ఛా వోటార్కర్ శుక్రవారం చిక్కడపల్లిలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వేచ్చా వోటార్కర్ తన తల్లి, పాఠశాలకు వెళ్లే కుమార్తెతో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లోని పెంట్‌హౌస్‌లో నివసిస్తోంది. సాయంత్రం పాఠశాల నుండి తిరిగి వచ్చిన ఆమె కుమార్తె, పదే పదే బెడ్ రూమ్ తలుపు తట్టినప్పటికీ లోపలి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసింది. ఆమె అప్రమత్తంతో, పొరుగువారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, గదిలో స్వేచ్చ అపస్మారక స్థితిలో పడి ఉండటం కనిపించింది.

Next Story