కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు తాగిన తర్వాత పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు. నివేదికల ప్రకారం, బాధితులు వింత వింతగా ప్రవర్తించడం ప్రారంభించారు. అంతేకాకుండా మానసిక సమతుల్యత కోల్పోయినట్లు కనిపించారు. బాధిత వ్యక్తులందరినీ వెంటనే చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
దుర్కి గ్రామంలో అనేక మంది కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలయ్యారు. గ్రామంలోని బాధితులంతా మతిస్థిమితం కోల్పోయినట్టు వింతగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.