విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కీలక తీర్పు
Supreme Court key judgment on the division of power employees. విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
By Medi Samrat Published on 7 Dec 2020 8:06 AM GMT
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై ఏర్పాటు చేసిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికపై తెలంగాణ.. సప్రీం కోర్టును ఆశ్రయించింది. అదనంగా ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా దర్మాసనం.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. జీతాలు, ఇతర సమస్యలపై ఉద్యోగులు సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ఉద్యోగులను రిలీవ్ చేసినప్పటికీ తెలంగాణ విద్యుత్ సంస్థలు విధుల్లో చేర్చుకోలేదని పలువురు ఉద్యోగులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. రిలీవ్ అయిన ఉద్యోగులు గత నాలుగు నెలలుగా జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగుల తరుపున సీనియర్ న్యాయవాది నరసింహ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివాదంలోని లేని 584 మందిని రాష్ట్రానికి అదనంగా కేటాయించారని తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది.