హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court Green Signal For Ganesh Immersion. హైదరాబాద్ పరిధిలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన పిటిషన్‌పై

By Medi Samrat  Published on  16 Sept 2021 12:18 PM IST
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ పరిధిలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం నాడు సుప్రీంకోర్టు విచారించింది. అయితే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మినహాయింపుని ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కోరింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది జీహెచ్ఎంసీ.

ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ట్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్ గురువారం నాడు విచారించింది. జీహెచ్ఎంసీకి మద్దతుగా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. విచారణ సమయంలో ధర్మాసనం జీహెచ్ఎంసీకి మొటిక్కాయలు వేసింది. ఎన్నో కోట్లు హైదరాబాద్ సుందరీకరణకు ఖర్చు చేస్తున్నా కూడా పర్యావరణాన్ని మాత్రం కాపాడడం లేదని ధర్మాసనం విమర్శించింది. ఈ ఒక్క ఏడాది మాత్రమే అవకాశం ఇస్తున్నామని.. వచ్చే ఏడాది నుండి హై కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందేనని సూచించింది.


Next Story