రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
Student killed in ghastly mishap. ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు.
By Medi Samrat Published on
1 May 2022 3:30 PM GMT

ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటన మేడ్చల్‌లోని గాగిల్లాపూర్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో లోకేష్ (21) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు లారీ డ్రైవర్ తప్పించుకునేలోపే పట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి, క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ట్రాఫిక్‌ను కూడా పోలీసులు క్లియర్ చేశారు. లారీని, ద్విచక్ర వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story