ఆ రెండు రోజులు ఉద్యోగుల‌కు వేతనంతో కూడిన సెలవులు

లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మే 13, జూన్ 4న తేదీల‌లో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది

By Medi Samrat  Published on  7 May 2024 1:52 AM GMT
ఆ రెండు రోజులు ఉద్యోగుల‌కు వేతనంతో కూడిన సెలవులు

లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మే 13, జూన్ 4న తేదీల‌లో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. ఈ తేదీల్లో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, దేశంలోని అన్ని లోక్ సభ స్థానాల‌కు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇప్పటికే ప‌లు రాష్ట్రాలలో ఎన్నికలు కూడా ముగిశాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో మే 13 న ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ‌లో లోక్‌స‌భ స్థానాల‌కు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ, లోక్‌స‌భ స్థానాల‌కు పోలింగ్ జ‌రుగ‌నుంది. జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం వేత‌నంతో కూడిన సెల‌వును ప్ర‌క‌టించింది.

Next Story