పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. బుధవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల నేపథ్యంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (విద్య) బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30న ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిపారు.
డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఇప్పటికే ఆన్సర్ స్క్రిప్ట్‌ల మూల్యాంకనం పూర్తి చేసినట్లు.. ఫలితాల విడుదలకు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 2,676 కేంద్రాల్లో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు.