వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!

ఈ వర్షాకాలంలో, శ్రీశైలం ఆనకట్ట సందర్శన మిస్ అవ్వకూడదు. ఇటీవల ఆరు గేట్లు తెరిచారు.

By Medi Samrat
Published on : 14 Aug 2025 7:30 PM IST

వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!

ఈ వర్షాకాలంలో, శ్రీశైలం ఆనకట్ట సందర్శన మిస్ అవ్వకూడదు. ఇటీవల ఆరు గేట్లు తెరిచారు. కృష్ణ నది నీరు వరదలా కిందకు ప్రవహిస్తుంది. ఈ దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. హైదరాబాద్ నుండి 215 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రకృతి సౌందర్యానికి నిలయం. ఇంజనీరింగ్ అద్భుతం. రోడ్డు మార్గంలో ప్రయాణం దాదాపు 6-7 గంటలు పడుతుంది. వంకరలు తిరిగే ఘాట్ రోడ్లు అందాన్ని మరింత పెంచుతాయి. వర్షాకాలంలో అడవులు పచ్చదనంతో నిండి ఉంటాయి. పర్యాటకులకు మరపురాని దృశ్యాలను అందిస్తాయి.

MGBS, JBS నుండి ప్రతిరోజూ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతూ ఉంది. శ్రీశైలం చేరుకోడానికి దాదాపు 6-7 గంటలు పడుతుంది. ప్రైవేట్ క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. వసతి కోసం srisailamonline.com ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

Next Story