ఆ చెట్లపై పిట్ట కూడా వాలదు, దయచేసి తొలగించండి..ప్రభుత్వానికి స్పీకర్ వినతి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
ఆ చెట్లపై పిట్ట కూడా వాలదు, దయచేసి తొలగించండి..ప్రభుత్వానికి స్పీకర్ వినతి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ కవరేజీని, అడవులను పెంచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గొప్పగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. పది సంవత్సరాలలో రూ.10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటారని అన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీలు, పల్లె వనాలు ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం కారణంగా 7 శాతం గ్రీన్ కవరేజీ పెరిగిందని అన్నారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కామెంట్స్‌పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా కోనోకార్పస్ మొక్కలను నాటారు. దీనికి నీరు అవసరం లేదు, ప్రతిచోటా పెరుగుతుంది. ఇది ఆక్సిజన్ తీసుకుంటుంది మరియు కార్బన్-డై-ఆక్సైడ్‌ను ఇస్తుంది. ఏ పక్షి దానిపై కూర్చోదు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి చెట్లను ఉంచారు. ఇలాంటి మొక్కలను తెలంగాణ వ్యాప్తంగా నాటారు. ఏ ఊరు ..ఏ రోడ్డు చూసినా ఇలాంటి మొక్కలే ఉన్నాయి. ఇలాంటి మొక్కలు రాష్ట్రంలో ఎక్కడున్నా తొలగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అని స్పీకర్ అన్నారు.