భారీ వర్షాల ఎఫెక్ట్‌: పలు రైళ్లు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

భారీ వర్షాలతో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, మెదక్ వెళ్లే రైళ్ల రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

By Knakam Karthik
Published on : 28 Aug 2025 1:42 PM IST

Telangana, Heavy Rains, Floods, Hyderabad Rains, South Central Railway

భారీ వర్షాల ఎఫెక్ట్‌: పలు రైళ్లు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

భారీ వర్షాలతో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని నిజామాబాద్, వరంగల్, కామారెడ్డి, మెదక్ వెళ్లే రైళ్ల రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. కాగా మొత్తం 14 రైళ్లను రద్దు చేయగా, 4 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతికూల వాతావరణం, ట్రాక్ వరదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, పరిస్థితి మారిన కొద్దీ క్రమం తప్పకుండా నవీకరణలు అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హామీ ఇచ్చారు.

Next Story