తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

నేటితో రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం పంపారు.

By Medi Samrat
Published on : 28 Nov 2023 4:33 PM IST

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

నేటితో రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ వీడియో సందేశం పంపారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్న.. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్న.. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నా.. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కలలు సహకారం అవ్వాలి.. మీకు మంచి ప్రభుత్వం లభించాలి.. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు.. ఈ ప్రేమ ,అభిమానాలకు నేను ఎప్పటికి మీకు రుణపడి ఉంటాను.. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం.. మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేయండి.. మార్పు కావాలి ..కాంగ్రెస్ రావాలి అని వీడ‌యో సందేశంలో పేర్కొన్నారు.

Next Story