జై తెలంగాణ అని గట్టిగా నినదిద్దామని.. నాకు తెలుగులో మాట్లాడాలని ఉందని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. తెలుగు భాష చాలా అందంగా ఉంటుందని అన్నారు. మా నాన్న ఇక్కడికి వచ్చేవారని.. అప్పటి నుండే నాకు తెలుగుతో అనుబంధం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల బాధ అర్థం చేసుకున్న సోనియాగాంధీకి సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారు. తెలంగాణ సమస్య ఎవరు వినలేదు. సోనియా మాత్రం తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారని అన్నారు. వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు ఈ వేదిక వెలిగిపోతోంది. తెలంగాణ ప్రజల బాధలు చూసి రాష్ట్ర ఏర్పాటు చేశాం. రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటు చేశాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది అనడం హాస్యాస్పదం. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినందుకు సంతోషంగా ఉంది. తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉంది. తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్ నుండి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయి. తెలంగాణలో పరిస్థితులు చూసి సోనియా, రాహుల్ బాధ పడుతున్నారు. తెలంగాణ బాధలు మార్చడానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ ఆలోచన. మీరు ఎప్పుడు పిలిచినా ఒక కాల్ చేయగానే నేను తెలంగాణకి వచ్చేస్తానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని మీరా కుమార్ అన్నారు.