ఏమైంది.. ఎలా ఉంది హన్మంత్.. వీహెచ్‌కు కాల్ చేసిన సోనియా

Sonia Gandhi Call To VH. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ పీసీసీ మాజీ అధ్యక్షులు వీ. హనుమంతరావుకు

By Medi Samrat  Published on  1 July 2021 7:58 AM GMT
ఏమైంది.. ఎలా ఉంది హన్మంత్.. వీహెచ్‌కు కాల్ చేసిన సోనియా

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ పీసీసీ మాజీ అధ్యక్షులు వీ. హనుమంతరావుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి ప‌రామర్శించారు. ఏమైంది.. ఎలా ఉంది హన్మంత్ అని వీహెచ్‌ ఆరోగ్య పరిస్థితిని సోనియా గాంధీ అడిగి తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని.. ఇంతకు ముందు కరోనా వచ్చిందని.. ఇప్పుడు కాస్త బాగుందని వీహెచ్ సోనియాకు తెలిపారు.

జీవితం చాలా ముఖ్యమైంది.. ఆరోగ్యం కాపాడుకోవాలని సోనియా గాంధీ వీహెచ్‌కు సూచించారు. మీ ఆశీస్సులు కావాలని వీహెచ్ సోనియాను కోరారు. మీరు నా మనిషి, కాంగ్రెస్ మనిషి మీరు బాగుండాలని సోనియా గాంధీ వీహెచ్‌తో అన్నారు. ఇదిలావుంటే.. బుధ‌వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వీహెచ్‌కు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేఫ‌థ్యంలో సోనియా గాంధీకి, కేసి వేణుగోపాల్ కు వీహెచ్‌ ధన్యవాదాలు తెలిపారు.


Next Story
Share it