ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సోనియా
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలను సోనియా గాంధీ ప్రకటించారు.
By Medi Samrat Published on 17 Sept 2023 8:45 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలను సోనియా గాంధీ ప్రకటించారు. తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరీ బహిరంగ సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని.. అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని, ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలను అభివృద్ధి చేయడం రాష్ట్రం ఇచ్చిన వాళ్లుగా తమ మీద బాధ్యత ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని తెలంగాణ ప్రజలను కోరారు.
విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలు
1. మహాలక్ష్మీ (Maha Lakshmi)
a. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సహాయం అందజేత
b. రూ. 500 కేగ్యాస్ సిలిండర్ అందజేత
c. మహిళలకు రాష్టమంతట టీఎస్ఆర్టీసీబస్సుల్లో ఉచిత పయ్రాణం
2. రైతు భరోసా (Raithu Bharosa)
a. ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15,000, వ్యవసాయకూలీలకు రూ.12,000 అందజేత
b. వరిపంటకు రూ. 500 బోనస్.
3. గృహ జ్యోతి (Gruha Jyothi)
a. అన్ని కుటుంబాలకు 200యూనిట్లఉచిత విద్యుత్తు సౌకర్య కల్పన
4. ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu)
a. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటిస్థలం,రూ. 5 లక్షల ఆర్థిక సాయం.
b. అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చ. గజాల ఇంటిస్థలం అందజేత.
5.యువ వికాసం (Yuva Vikasam)
a. విద్య భరోసా కార్డు - రూ. 5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీరహిత విద్యార్థిఆర్ధిక సహాయక కార్డుఅందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ పయ్రాణ ఖర్చులు,ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీమెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు , స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మరియు ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయకల్పన.
b. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు.
6. చేయూత (Cheyutha)
a. ప్రతి నెలా రూ.4,000 చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత.
b. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు