మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి పర్యటనకు వెళ్లారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ ప్రకటన తర్వాత షబ్బీర్ అలీ జిల్లాకు వచ్చారు. దీంతో జనగామ, దోమ కొండ, పాల్వంచ గ్రామస్థులు షబ్బీర్ అలీకి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ పోటీ చేసినా మా మద్దతు షబ్బీర్ అలీకే అంటూ మూడు గ్రామాల ప్రజలు మద్దతు తెలిపారు. ఈ మేరకు నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ వద్దురా.. షబ్బీర్ అలీ ముద్దురా, తరిమి కొడదాం.. తరిమి కొడదాం.. కేసీఆర్‌ను తరిమికొడదాం అంటూ నినాదాలు చేస్తూ షబ్బీర్ అలీకి తమ మద్దతు తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పూర్తి జాబితాను దాదాపుగా ప్రకటించారు. కేవలం 4 స్థానాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో అనూహ్య మార్పులు పెద్దగా లేకపోయినా.. సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతుండటం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.