Telangana : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో హైకోర్టు సంచల‌న తీర్పు

ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో హైకోర్టు సంచల‌న తీర్పు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి హైకోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది

By Medi Samrat  Published on  12 Sept 2024 7:04 PM IST
Telangana : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో హైకోర్టు సంచల‌న తీర్పు

ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో హైకోర్టు సంచల‌న తీర్పు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి హైకోర్టు నిందితుడికి మరణశిక్ష విధించింది. గత ఏడాది అక్టోబర్ 16న బీడీఎల్ భానురులో నివాసం ఉంటున్న అలీ అనే 56 ఏళ్ల వ్య‌క్తి ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మ‌త్తుమందు క‌లిపి తాగించాడు. స్పృహ కోల్పోయిన చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి ఎస్పీ రూపేష్ కుమార్ త్వరితగతిన విచార‌ణ పూర్తి చేసి పూర్తి సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. ఈ క్రమంలోనే నిందితుడికి 11 నెలల్లోనే శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. ఈ కేసులో బీహార్‌కు చెందిన నిందితుడు అలీకి ఉరిశిక్ష విధించడమే కాకుండా చిన్నారి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు ప‌ట్ల‌ సంగారెడ్డి వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన సంగారెడ్డి ఎస్పీ రూపేష్ కుమార్ కు బాలిక తల్లిదం డ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story