శంషాబాద్ బంద్ కు ప్రజల మద్దతు

ఇటీవల హనుమాన్ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా శంషాబాద్‌ బంద్‌ కు పిలుపునిచ్చారు.

By Medi Samrat  Published on  6 Nov 2024 3:55 PM IST
శంషాబాద్ బంద్ కు ప్రజల మద్దతు

ఇటీవల హనుమాన్ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా శంషాబాద్‌ బంద్‌ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.

బుధవారం శంషాబాద్ బంద్‌కు స్థానిక హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. బంద్ పిలుపు మేరకు వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. దేవాలయాలపై పదే పదే దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హిందూ సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యాపార, విద్యా సంస్థలు మూసి ఉంచాలని హిందూ సంస్థలు కోరాయి. సైబరాబాద్ ఎస్‌ఓటీ, ఆర్మ్‌డ్ రిజర్వ్, స్థానిక పోలీసులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కాలనీలో హనుమాన్‌ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారుజామున పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయానికి వచ్చిన అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విగ్రహాలు ధ్వంసమైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

Next Story