మ‌రిపెడ ఎస్సైపై.. ట్రైనీ ఎస్ఐ లైంగిక దాడి ఆరోప‌ణ‌లు

Sexual Harassment On Trainee SI. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి.

By Medi Samrat
Published on : 3 Aug 2021 4:58 PM IST

మ‌రిపెడ ఎస్సైపై.. ట్రైనీ ఎస్ఐ లైంగిక దాడి ఆరోప‌ణ‌లు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెళ్లువెత్తున్నాయి. తనపై ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి అర్ధరాత్రి అత్యాచారం చేశారని దళిత ట్రైనీ ఎస్ఐ వరంగల్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి తనను అడవిలోకి తీసుకువెళ్లి బలత్కారం చేసినట్లు కుటుంబసభ్యులతో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితురాలు ఆరోపించింది. దళిత యువతి కావడమే తన బిడ్డ చేసిన పాపమా? అని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

తనకు న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దీంతో వరంగల్ సీపీ తరుణ్‌జోషి శ్రీనివాస్‌రెడ్డిపై వెంట‌నే చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడి జ‌రిపిన‌ట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని.. మహబూబాబాద్‌ ఎస్పీని వరంగల్ సీపీ తరుణ్‌జోషి ఆదేశించారు. ఈ విష‌య‌మై మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్ ఆధ్వర్యంలో మ‌హిళ‌లు డీజీపీ కార్యాలయం ముందు మెరుపు ధర్నా నిర్వ‌హించారు. బాధితురాలికి న్యాయం చేయాల‌ని.. ఎస్సైపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు. డీజీపీ, హోం మంత్రి కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు.




Next Story