తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
కాగా ఐదుగురు ఎమ్మెల్యేలపై ఆరోపణలను కొట్టిపారేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ సందర్బంగా బండ్ల మోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డిలపై నమోదైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు.