తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి సెలవులు ప్రకటించింది. పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటన విడుదల చేసింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 13వ తేదీన రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం అవుతోంది. ఇదే రోజున భోగి వచ్చింది. 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ వున్నాయి. 17వ తేదీన పాఠశాలలకు ప్రభుత్వం అదనంగా సెలవును ప్రకటించింది. రెండో శనివారం, ఆదివారం కలిపి మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యాసంస్థలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.
సాధారణ సెలవుల జాబితా కింద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి, భోగి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులతో పాటు.. మరో రెండు సెలవులను కూడా జాబితా చేశారు. జనవరి 25న హజ్రత్ అలీ పుట్టినరోజు కోసం ఐచ్ఛిక సెలవుదినం కాగా.. జనవరి 26 రిపబ్లిక్ డేకి సాధారణ సెలవుదినంగా ఇచ్చారు.