Sangareddy : ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్

సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు

By Medi Samrat  Published on  25 Jan 2025 4:53 PM IST
Sangareddy : ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్

సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు. విద్యార్థులను కంకర మోయించినందుకు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన టీచర్లు మంజుల, శారద, నాగమణికి నోటీసులు పంపారు. పాఠశాలలో విద్యార్థులను ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని క్రాంతి హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థినులతో రాళ్లు,ఇటుకలు మోయించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. కలెక్టర్ కార్యాలయం ముందున్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలతో ఉపాధ్యాయులు కూలీ పనులు చేపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి.

Next Story