ఇందిరమ్మ ఇళ్లు ఇరుకని వెక్కిరించిన మీరు.. ఎంతమందికి ఇళ్లు కట్టించారు.?

హైదరాబాద్ తో నాకు మంచి అనుబంధం ఉందని.. హైదరాబాద్ వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుందని

By Medi Samrat  Published on  8 Nov 2023 9:30 AM GMT
ఇందిరమ్మ ఇళ్లు ఇరుకని వెక్కిరించిన మీరు.. ఎంతమందికి ఇళ్లు కట్టించారు.?

హైదరాబాద్ తో నాకు మంచి అనుబంధం ఉందని.. హైదరాబాద్ వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. గాంధీభవన్‌లో బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సోనియా ఇందిరా గాంధీతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయ్..అమ్మ సోనియా గాంధీతో మీరు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సామాన్య ప్రజలకు తిండి, మంచి బట్టలు, ఇల్లు అవసరం. కానీ తెలంగాణ బీఆర్ఎస్ స‌ర్కార్‌ డబుల్ బెడ్ రూం ఇస్తామన్నారు..ఏమైంది.. అని ప్ర‌శ్నించారు. అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారని అన్నారు.. 9 నెలల‌లోపు ప్రగతి భవన్ కట్టారు.. కాని డబుల్ బెడ్ రూం లు మాత్రం ఇవ్వలేదన్నారు.

మేము అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు ఇల్లు కట్టడానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కంటే మంచి ఇల్లు కడతామన్నారు.. మేము కట్టిన ఇళ్లను ఇరుకుగా ఉన్నాయని వెక్కిరించిన మీరు.. ఎంతమందికి ఇల్లు కట్టించారో కేసీఆర్ చెప్పాలి అని ప్ర‌శ్నించారు.

ఇల్లు లేని వారికి భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు.. 5.72 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు.. 65 లక్షల మందికి ఇల్లు లేవు..కట్టిన డబుల్ బెడ్ రూము లు కూడా సరిగా లేవు.. నాణ్యత లోపం ఉంది.. వర్షం వస్తే నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి.. ఇది ప్రభుత్వం చేతగాని తనం అని మండిప‌డ్డారు.

ఇదో పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. సాధారణ ప్రజలకు సంబందించిన ఇళ్లులు.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం చేసి నాణ్యత పాటించకుండా నిర్మించారు.. కామారెడ్డి లో కట్టిన డ‌బుల్ ఇల్లులు ఇప్పటికే పగుళ్లు వచ్చాయి.. వాటిని ఎవరూ తీసుకోవడం లేదని.. అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదేనా సాధారణ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం అని మండిప‌డ్డారు.

ఇళ్ల నిర్మాణానికి 23,679 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ రూ.380 కోట్లు మాత్ర‌మే కేటాయించారని వివ‌రించారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం. సిటీ లో 8 ఏరియల్లో మాత్రమే ఇల్లు నిర్మిస్తున్నారు.. ఇళ్ల పేరుతొ లూటీ చేస్తున్నారు.. ఇల్లు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో కనీసం ప్రజలకు చెప్పండి.. సాధారణ ప్రజలంతా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు.. ప్రజలకు మా విజ్ఞప్తి.. మీ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నికల్లో నిర్ణయం తీసుకోండన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఈ ప్రాంత ప్రజల భవిష్యత్ అని పేర్కొన్నారు.

Next Story