సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు

మే 6 నుండి నిరసన ప్రారంభించాలని ప్రణాళికలు ప్రకటిస్తూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) సమ్మె నోటీసు జారీ చేసింది.

By Medi Samrat
Published on : 7 April 2025 8:45 PM IST

సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు

మే 6 నుండి నిరసన ప్రారంభించాలని ప్రణాళికలు ప్రకటిస్తూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) సమ్మె నోటీసు జారీ చేసింది. టిజిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, లేబర్ కమిషనర్లకు ఇందుకు సంబంధించి అధికారిక నోటీసులు అందాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మే 7 నుండి విధులను బహిష్కరిస్తామని ఆర్టీసీ జెఎసి తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు నేటికీ జమ కాలేదని ఫిర్యాదు చేశారు.

తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఇదివరకే ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మెకు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె చేపట్టేందుకు సిద్ధం అయింది.

Next Story