రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో బస్సు ప్రమాద భాదితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజీత్ రెడ్డి, ఎంఎల్ఏ కాలే యాదయ్య పరామర్శించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది. మృతుల్లో పది మంది మహిళలు, 8 పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 19 మందిలో 13 మంది మృతులను పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి పంపిస్తాం..అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.