పవన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్‌కు ఆర్కే సాగర్ కౌంటర్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్ ఘాటుగా సమాధానమిచ్చారు.

By -  Knakam Karthik
Published on : 10 Feb 2026 12:34 PM IST

Telangana, Municipal Elections, Congress, MLA Anirudhreddy, JanaSena Telangana, RK Sagar, PawanKalyan

పవన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్‌కు ఆర్కే సాగర్ కౌంటర్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్ ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి అనిరుధ్ రెడ్డి మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ఎమ్మెల్యే అయ్యాడో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడే అర్హత అనిరుధ్‌రెడ్డికి లేదని కౌంటర్ ఇచ్చారు.

తన సొంత కోట్లాది రూపాయల సంపాదనను ప్రజల కోసం ఖర్చు చేస్తున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్ అని, ఆయనను విమర్శించే స్థాయి అనిరుధ్ రెడ్డికి లేదని మండిపడ్డారు. అనిరుధ్ రెడ్డి తన జీవితంలో ఒక్క రూపాయి అయినా సొంత జేబులోంచి ప్రజల కోసం ఖర్చు చేశారా?" అని RK సాగర్ నిలదీశారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తున్నారు.. మీకు సిగ్గుందా?..అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story