ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  5 Dec 2023 6:35 PM IST
ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు సీఎం రేసులో ఉన్న టీ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. దీంతో తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరనే విష‌య‌మై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అత్యవసర కాల్ తో ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఫ‌లితాలు వెల్ల‌డైన‌ మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి హోటల్ నుంచి బయటకు వచ్చారు. ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి హోటల్ కు వెళ్లారు. మరికొద్ది నిమిషాలలో సీఎం పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండడంతో రేవంత్ రెడ్డి హోటల్ నుంచి బయటకు వెళ్లారు. అయితే.. సీపీఐ నేతలు నారాయణ, చాడా వెంక‌ట్ రెడ్డి, కూనంనేని సాంబ‌శివ‌రావు ఇప్పటికే రేవంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story