ఆ రోజే బాధ్యతలు తీసుకుంటా.. రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

Revanth Reddy Taking Charge On July 7th As PCC Chief. టీపీసీసీ ఛీప్‌గా రేవంత్ రెడ్డి నియ‌మితులైన విష‌యం తెలిసిందే. అయితే.. బాధ్య‌త‌లు

By Medi Samrat  Published on  27 Jun 2021 2:49 PM GMT
ఆ రోజే బాధ్యతలు తీసుకుంటా.. రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియ‌మితులైన విష‌యం తెలిసిందే. అయితే.. బాధ్య‌త‌లు ఇంకా చేప‌ట్ట‌లేదు. ఈ నేఫ‌థ్యంలో.. జులై 7 మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు టీపీసీసీ అధ్య‌క్ష‌ బాధ్యతలు తీసుకుంటాన‌ని రేవంత్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం బలం ఎంతో.. బీజేపీ బలం అంతేన‌ని ఆయ‌న అన్నారు. టీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతముగా బలంగా ఉందని రేవంత్ అన్నారు. బీజేపీ అయోధ్య భూముల వ్యవహారంలో రాముడిని కూడా తెగనమ్ముకున్నారని.. రాముడి పేరు తీసుకోవడానికి బీజేపీ నాయకులకు అర్హత లేదని రేవంత్ అన్నారు.


కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని.. సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయని రేవంత్ అన్నారు. తెలంగాణలో ప్రజల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని.. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నా పాదయాత్ర ఉండే అవకాశం ఉందని.. అది ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్టీఆర్, వైఎస్సార్ ల‌ను విమర్శించడం వికృతమైన చర్యగా అభివ‌ర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటాన‌ని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఇప్పడు తిరుగుబాటుగా మరాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు.

టీఆర్ఎస్, బీజేపీ కలసి పోటీ చేసిన లింగోజి గూడలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని.. లింగోజి గూడ వ్యవహారంలో ప్రగతి భవన్ వెళ్లినందుకు బీజేపీ కమిటీ ఇచ్చిన నివేదికపై ఏ చర్యలు తీసుకున్నారు ? ఎప్పటి లోగా చర్యలు తీసుకుంటారు? బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ అన్నారు.


Next Story