ఈ రోజు నుంచి వ్య‌క్తిగ‌త నినాదాలు వ‌ద్దు.. టీపీసీసీ ఛీప్‌గా మొద‌టి ప్ర‌సంగంలో రేవంత్ మాట‌ల తూటాలు

Revanth Reddy Speech As PCC Cheif. టీపీసీసీ ఛీప్‌గా రేవంత్ రెడ్డి కొద్ద‌సేప‌టి క్రితం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  7 July 2021 11:11 AM GMT
ఈ రోజు నుంచి వ్య‌క్తిగ‌త నినాదాలు వ‌ద్దు.. టీపీసీసీ ఛీప్‌గా మొద‌టి ప్ర‌సంగంలో రేవంత్ మాట‌ల తూటాలు

టీపీసీసీ ఛీప్‌గా రేవంత్ రెడ్డి బుధ‌వారం మ‌ధ్యాహ్నం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్ర‌మాణ‌ స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన పార్టీ నేతలందరికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. వర్షం పడుతూ ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని అన్నారు. పోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహస్వామిల దయతో పాటు సోనియమ్మ ఆశీస్సులతో ఈ పదవి చేపడుతున్నాన‌ని పేర్కొన్నారు. సభా వేధిక నుంచి చెప్తున్నా నేటి నుండి సోనియా, రాహుల్ గాంధీల నినాదాలు తప్ప మరో వ్యక్తి నినాదాలు వినిపించకూడదని అన్నారు. మరో వ్యక్తి నినాదం చేస్తే.. ఎంతటి వారినైనా క్షమించ‌మ‌ని అన్నారు.


నిరుద్యోగులు, దలితులు, బడుగు బలహీన వర్గాలను టిఆర్ఎస్ ప్రభుత్వం నయవంచనకు గురిచేసిందని ఫైర్ అయ్యారు. నాలుగు కోట్ల ప్రజలు తమ ఇళ్ళలో సోనియమ్మ గుడి కట్టుకోవాలని.. నాయకులు సందేశాన్ని ప్రతీ గడపగడపకు తీసుకెళ్ళాలి. వేలాది మంది సైనికులకు నాయకుడు ముందు ఉంటే.. ఈ ప్రపంచాన్ని గెలువొచ్చని చెప్పారు. అలా ముందుకు నడిపించే సోనియా, రాహుల్ గాంధీ లు ఉన్నారని అన్నారు. కరోనా కంటే డేంజర్.. మోదీ, కేసీఆర్ ల‌ని అన్నారు.

ప్రతీ కార్యకర్త రెండు సంవంత్సరాలు ఇంటికి సెలవు పెట్టాలని కార్య‌క‌ర్త‌ల‌నుద్దేశించి అన్నారు. రెండేళ్లు కష్టపడితే.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ఇప్పుడు లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ను, కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరలు దాటించాలని.. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.

రావణాసురుడు సీతమ్మను ఎం చేసాడో మనకు తెలుసు.. ఇప్పుడు కేసీఆర్.. రావణాసురుడు వలె తెలంగాణ తల్లిని ప్రగతి భవన్ బందీని చేసాడు. ఆనాడు సీతను రాముడు విముక్తి చేస్తే.. ఇప్పుడు తెలంగాణ తల్లిని విముక్తి చేయమని సోనియమ్మ నన్ను పంపించిందని.. రాముడికి వాణరసైన్యం సహాయం చేసినట్లు.. మీరు నాకు సహాయం చేయాలని రేవంత్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకే(ప్ర‌శాంత్ కిశోర్‌) ను సలహాదారుగా పెట్టుకోవాలి కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారని.. తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకే న‌ని.. ఇంత మంది పీకే లు ఉండగా.. మాకు పీకే అవసరమా.. అని వారిని ప్ర‌శ్నించారు. ఏపీలో కాంగ్రెస్ చనిపోయినా పర్వాలేదు అని తెలంగాణ ఇస్తే.. సోనియా గాంధీకి మ‌నం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదా అని ప్ర‌శ్నించారు.


Next Story
Share it