సీనియ‌ర్స్‌తో వ‌రుస భేటీలు.. రేవంత్ బిజీబిజీ

Revanth Reddy Meet With Senior Congress Leaders. టీపీసీసీ ప‌ద‌విని ద‌క్కించుకున్న రేవంత్ రెడ్డి వరుసగా సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతున్నారు.

By Medi Samrat
Published on : 28 Jun 2021 10:31 AM IST

సీనియ‌ర్స్‌తో వ‌రుస భేటీలు.. రేవంత్ బిజీబిజీ

టీపీసీసీ ప‌ద‌విని ద‌క్కించుకున్న రేవంత్ రెడ్డి వరుసగా సీనియర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ నేత‌లు జానారెడ్డి, ష‌బ్బీర్ అలీని క‌లుసుకున్న రేవంత్‌.. ఈ ఉద‌యం మ‌రో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చిన్నారెడ్డిని క‌లుసుకున్నారు. అనంత‌రం మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్ లోని ఆయ‌న‌ నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంత‌రం హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావును కలిసి పరామ‌ర్శించ‌నున్నారు. అక్కడి నుంచి నేడు మాజీ ప్ర‌ధాని పీవీ న‌రిసింహారావు జ‌యంతి నేఫ‌థ్యంలో.. పీవీ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పిస్తారు.


ఇదిలావుంటే.. పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నన్ను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింద‌ని.. రేవంత్‌రెడ్డి సహా నూత‌న కార్య‌వ‌ర్గం ఎవ‌రూ న‌న్ను క‌లిసేందుకు ప్రయత్నించొద్దని.. నా దగ్గరికి వస్తే నిజమైన కార్యకర్తలు బాధపడతారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేఫ‌థ్యంలో రేవంత్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని క‌లుస్తారా..? అధిస్టానం ఈ విష‌యంలో జోక్యం చేసుకుంటుందా..? చూడాలి మ‌రి.


Next Story