లొల్లికి బ్రేక్.. ఒకే వేదికపై రేవంత్, కోమటిరెడ్డి
Revanth Reddy Komatireddy Venkatereddy Appeared on the same stage. ఇందిరాపార్కు వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ రెండు రోజుల పాటు
By Medi Samrat Published on 27 Nov 2021 9:13 AM GMT
ఇందిరాపార్కు వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ రెండు రోజుల పాటు వరి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే.. పీసీసీ అధ్యక్ష పదవికై చివరి వరకూ రేవంత్‌తో పోటీపడి, నిన్నమొన్నటి వరకూ అతనిని వ్యతిరేకించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ దీక్షకు హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది. ఇద్దరు నేతలు వేదికపై పక్కపక్కన కూర్చుని నవ్వుతూ ముచ్చటించుకోవడం దీక్షకు హాజరైన కార్యకర్తల్లో కూడా జోష్ నింపింది.
ఇదిలావుంటే.. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ లోకి అడుగుపెట్టలేదు. ఆయనపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల దారుణ ఓటమిపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవిని డబ్బు పెట్టి దక్కించుకున్నాడని రేవంత్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే రేవంత్ మాత్రం దీనిని స్పోర్టివ్ స్పిరిట్ తోనే తీసుకుని ముందుకువెళ్లాడు. చాలా సందర్భాలలో కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ.. ఒకే వేదికపై ఇద్దరూ కన్పించడం.. మాట్లాడుకోవడం కన్పించింది. దీంతో లొల్లికి షార్ట్ కమర్శియల్ బ్రేక్ పడిందంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.