మాజీ ప్రధానమంత్రి, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు స్వర్గీయ పీవీ నర్సింహారావ్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ కారణమని అన్నారు. భూ సంస్కరణలు తెచ్చి.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారని తెలిపారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమని రేవంత్ అన్నారు.
పీవీ.. ప్రతీ ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి అని కొనియాడారు. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదగడంలో ఆయన సేవలు మరవలేనివని అన్నారు. దివంగత జైపాల్ రెడ్డి.. పీవీ అడుగుల్లో నడిచారని పేర్కొన్నారు. తెలంగాణ అభ్యున్నతికి కాంగ్రెస్ పాటు పడుతుందని అన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతృప్తి గా జరిగాయని తెలుస్తుంది.. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పీవీ ఈ జాతి సంపద.. పీవీ వ్యక్తి కాదు ఓక శక్తి అని కీర్తించారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందని రేవంత్ అన్నారు.