ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని.. రేవంత్ ఫైర్‌

Revanth Reddy Fires On Govt. ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైద్రాబాద్ చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..

By Medi Samrat  Published on  24 July 2021 1:50 PM GMT
ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని.. రేవంత్ ఫైర్‌

ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైద్రాబాద్ చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఇంటికి వెళ్లారు. ఇటీవల కాంగ్రెస్‌ చేప‌ట్టిన ఛ‌లో రాజ్‌భ‌వ‌న్‌ నిరసన కార్యక్రమంలో తీవ్ర గాయాలపాలైన వెంకట్ ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. వెంక‌ట్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్ వెంట‌ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కూడా వెంక‌ట్ ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల దర్నాచౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పోలీసుల అతి ఉత్సాహంతో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో అతని పక్కటెముకకు ఫ్రాక్చర్ అయిందని.. పోలీసులు తెలంగాణ తుగ్లక్ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం, పోలీసులు కాలరాస్తున్నారని అన్నారు.

ప్రజా సమస్యలపై కొట్లాడే నాయకులను భ‌యాందోళ‌ల‌నకు గురిచేసే విధంగా ప్రజా రక్షక భటులుగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు సైతం.. గూండాల్లా విపక్ష నాయకులపై దాడి చేయడం హేయనీయమైన చర్యని విమ‌ర్శించారు. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేసినంత మాత్రాన.. పోలీసుల అండతో పోరాటాలను ఆపలేరని.. సంబంధిత అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story
Share it