కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు.. వంద మంది పీకే లు, ప్రకాష్ రాజ్ లు వ‌చ్చినా..

Revanth Reddy Fires On CM KCR. తెలంగాణ ఆక్రమణకు సీఎం కేసీఆర్ కుట్రప‌న్నార‌ని.. అందుకే ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నార‌ని

By Medi Samrat  Published on  28 Feb 2022 11:51 AM GMT
కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు.. వంద మంది పీకే లు, ప్రకాష్ రాజ్ లు వ‌చ్చినా..

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమం జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా నల్గొండలో 4లక్షల 30వేలు మెంబర్ షిప్ న‌మోద‌య్యిందని.. అతి తక్కువగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో 47 వేల మెంబర్ షిప్ అయ్యింద‌ని తెలిపారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిగా గీతారెడ్డి ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సెకండ్ ప్లేస్ వుందని వెల్ల‌డించారు. 34 లక్షల 50 వేల సభ్యత్వాలు వెరిఫైడ్ .. 3 లక్షల 50 వేలు అన్ వెరిఫైడ్ మెంబర్ షిప్ అని వివ‌రించారు. మొత్తం.. 38 లక్షల సభ్యత్వాలు అయ్యాయి అంటే.. మా నాయకుల శ్రమ అర్ధం చేసుకోవాలని అన్నారు. ఏన్ రోలర్స్ ను అభినందించడానికి ఈ సభ.. మరికొందరిని ప్రోత్సహించడానికి ఈ సభ అని అన్నారు. సికింద్రాబాద్ లో జాతీయ స్థాయిలో నాయకులున్నారు.. బూత్ లెవల్ లో 100 సభ్యత్వాలు చేయకుంటే వారి పదవులు రద్దు చేయాలని.. దానికి బోసు రాజునే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

అనంత‌రం మాట్లాడుతూ.. కేసీఆర్ భయంలో పడ్డాడు.. బీహార్ కెళ్ళి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నాడని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పథకాలన్నీ మన కార్యకర్తలకే వస్తాయి.. దానికి నేను హామీ ఇస్తున్నాన‌ని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, ఉద్యోగాలు.. ఇలా అన్ని మన మెంబర్షిప్ తీసుకున్న వారికేన‌ని వ్యాఖ్యానించారు. గ్రామాలకు, తండాలకు వెళ్ళండి వారి సమస్యలు రాసుకురండని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. తెలంగాణ పోరాటానికి మనం కావాల్సి వచ్చింది. కానీ పదవులు వాళ్ళకే వచ్చాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి రాక‌ముందు.. ఆంద్రావాళ్లే తెలంగాణలో పెత్తనం చేస్తున్నారని రెచ్చగొట్టిండని.. నీళ్లు జగన్, నిధులు కృష్ణారెడ్డి తరలించుకెళ్తే.. నియామకాలు కేసీఆర్ ఇంటికి పోయాయని ఆరోపించారు.

బీహార్ బ్యాచ్ వచ్చి రాష్ట్రాన్ని ఏలుతున్నారని.. మరోసారి గెలవడానికి బీహార్ నుండి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నార‌ని అన్నారు. బీహార్ లో ఎన్నికలు జరిగితే తుపాకులు, బాంబులు పట్టుకొని తిరుగుతారు. ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, సందీప్ సుల్తానియా, రజత్ కుమార్, ఐపీఎస్ అంజనీ కుమార్ అంద‌రూ బీహార్ వాళ్లేన‌ని.. వీళ్లకు ఒక్కొక్కరికి ఐదారు శాఖలు వున్నాయని. కేసీఆర్ పూర్వికులు కూడా బీహార్ వాళ్లేన‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. బీహార్ ముఠా ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడిందని విమ‌ర్శించారు. నదులకు నడక నేర్పింది.. ఉచిత విద్యుత్, కేజీ టు పీజీ, టీఆరెస్ బ్యాచ్ అని చెబుతారు. మరి సంక నాకడానికి ప్రశాంత్ కిషోర్ ను తెచుకున్నారా.. అని మండిప‌డ్డారు.

తెలంగాణ ప్రాంత ఐఏఎస్, ఐపీఎస్ లు కనిపించడం లేరా అని ప్ర‌శ్నించిన రేవంత్‌.. మా పాలమూరు బిడ్డ ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పాలన నచ్చక రాజీనామా చేసి బయటికొచ్చిండని అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డిని రాజీనామా చేసి బ‌య‌ట‌కు రావాల‌ని అన్నారు.. ఐఏఎస్ మురళి ధైర్యం చేసి.. రాజీనామా చేసి బయటికొచ్చిండని అన్నారు.

నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లో తెలంగాణ వాళ్ళను తీసేసి, అంత ఆంధ్ర వాళ్ళను పెట్టుకుంటున్నార‌ని రేవంత్ అన్నారు. ఆంధ్ర బ్రాహ్మణులే.. బ్రాహ్మణులా.. తెలంగాణ వాళ్ళు కారా.. కేసీఆర్‌.. ఇప్పుడు అక్కడి వాళ్ళను ప్రోత్సహిస్తున్నార‌ని మండిప‌డ్డారు. చిన్న జీయర్ స్వామి ఎక్కడి వార‌ని ప్ర‌శ్నించారు రేవంత్‌. పీకే, ప్రకాష్ రాజ్ లు నిన్న మొన్నటి నుండి తిరుగుతున్నారని.. వంద మంది పీకే లు, ప్రకాష్ రాజ్ లు వచ్చిన ఏం పీకలేరని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.




Next Story